టెన్త్ క్లాస్ విద్యార్థి 23 ఏళ్ల యువతిని పొలాల్లోకి లాక్కెళ్లి..

by  |
Kerala Repe
X

దిశ, వెబ్‌డెస్క్ : స్కూల్ ఏజ్‌లోనే విద్యార్థులు చెడిపోతున్నారని అనడానికి ఇదో చక్కటి ఉదాహరణ. 10వ తరగతి కూడా పూర్తి కాకముందే ఆ విద్యార్థి కన్ను యువతుల వైపు మళ్లింది. ఏకంగా తన కన్న ఎనిమిదేళ్ల పెద్ద వయసున్న యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. రాష్ట్ర స్థాయి ఛాంపియన్ అయిన ఆ మైనర్ బాలుడు తన జీవితాన్ని కటకటల్లోకి నెట్టుకున్నాడు. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళలోని కొండొట్టి పట్టణానికి చెందిన 15 ఏళ్ల బాలుడు స్థానికంగా 10వ తరగతి చదువుతున్నాడు. అతడు జూడోలో రాష్ట్ర స్థాయి ఛాంపియన్. కాగా సోమవారం రాత్రి అదే పట్టణానికి చెందిన 23 ఏళ్ల యువతి ఒంటరిగా ఇంటర్‌నెట్ సెంటర్‌కు వెళ్తుంది. అది గమనించిన విద్యార్థి ఆమె వెనక నుంచి వెళ్లి గట్టిగా పట్టుకొని రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలుడిని యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెపై రాళ్లతో దాడి చేసి పారిపోయాడు.

భయంతో ఇంటికి పరుగులు తీసిన యువతి జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ఘటనపై విచారించగా.. అవన్నీ అబద్దాలని బుకాయించాడు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ను చూపించడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు. బుధవారం బాలుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.


Next Story

Most Viewed