కేటీఆర్‌కు ప్రేమ‌తో 108 పొట్రెయిట్స్‌!

by  |
కేటీఆర్‌కు ప్రేమ‌తో 108 పొట్రెయిట్స్‌!
X

దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్‌పై ఉన్న అభిమానంతో 108 పొట్రెయిట్స్ గీశారొక ఎన్నారై. మ‌నిషెప్పుడూ పుట్టిన త‌ర్వాత నేర్చుకుంట‌డు త‌ప్ప‌.. అన్ని నేర్చుకొని ఎవ‌రూ భూమ్మీదికి రారు. టైం మ‌న‌కోసం ఆగ‌దు. ఉన్న టైంను ఎవ‌రు ఎంత‌గొప్ప‌గా వాడుకున్నారు.. దాన్ని ఎంత‌బాగా వాడుకున్నారు అనేది ముఖ్యం అన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట‌ల‌ను స్ఫూర్తిగా తీసుకొని లాక్‌డౌన్ స‌మ‌యంలో ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ చేశాడు అతను. అమెరికాలోని కాలిఫోర్నియా న‌గ‌రం సాన్‌ఫ్రాన్సిస్కోలో ఉండే కొత్త అర‌వింద్ ఒప‌స్ మీడియా గ్రూప్‌ను నిర్వ‌హిస్తున్నారు. కోవిడ్-19 తో కాలిఫోర్నియా లాక్‌డౌన్‌లో ఉంది. ఇప్ప‌టికీ వారి ప‌నుల‌న్నీ ఇంటి నుంచే నిర్వ‌హిస్తున్నారు. ఇంట్లో ఉన్న‌ప్పుడు దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని ఏ మాత్రం వృథా చేసుకోకుండా ఎప్ప‌టి నుంచో ఆలోచ‌న ఉన్న తెలంగాణమంత్రి కేటీఆర్‌పై తీరొక్క స్కెచెస్ వేయ‌డం దృష్టి సారించారు. ఆలోచ‌న వ‌చ్చిందే ఆల‌స్యం 108 పొట్రెయిట్స్ గీయ‌డానికి శ్రీ‌కారం చుట్టారు అర్వింద్‌. 10 పొట్రెయిట్స్‌తో స‌రికొత్త‌ రికార్డు సృష్టింబోతున్నాడు. వాస్త‌వానికి ఇప్ప‌టివ‌ర‌కు ఒకే నాయ‌కుడి మీద 108 పొట్రెయిట్స్ గీసిన దాఖ‌లాలు లేవు. గ‌తంలో ముంబైకి చెందిన డాక్ట‌ర్ రాజేంద్ర కాంత‌క్ అనే ఆర్టిస్ట్ బాల్‌థాక్రేపై 101 పొట్రెయిట్స్ వేసిన రికార్డు ఉంది. తాజాగా అరవింద్ కేటీఆర్‌పై 108 పోట్రెయిట్స్ గీయ‌డంతో ఆ రికార్డును బ్రేక్ చేసిన‌ట్టు అవుతుంద‌ని చెప్తున్నారు. అర‌వింద్‌ది హైద‌రాబాద్‌. ఆర్టీసీ క్రాస్‌రోడ్ అశోక్‌న‌గ‌ర్‌లో ఉండే అత‌ను చాలా యేండ్ల క్రితం అమెరికా వెళ్లారు. ఇక తాను వేసిన పెన్సిల్ స్కెచెస్‌తో బుక్‌.. క్యాలెండ‌ర్ ముద్రించ‌డంతో పాటు ఇండియా వ‌చ్చిన త‌ర్వాత ఎగ్జిబిష‌న్ పెట్ట‌నున్న‌ట్లు అత‌ను చెప్తున్నారు. గ‌తంలో అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా 54వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఒబామా హావ‌భావాల‌ను స్కెచ్ వేస్తూ అత‌డికి బ‌హుమ‌తిగా అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా అర‌వింద్ బ‌హుమానం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. 2004లో హైద‌రాబాద్‌లో ఐదు రోజుల పాటు నిర్విరామంగా 108గంట‌ల పాటు స్కెచ్‌లు గీసి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి.. ఎస్‌పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యంల స్కెచ్‌లు కూడా వేసి శ‌భాష్ అనిపించుకున్నారు అర‌వింద్‌. తాజాగా కేటీఆర్‌పై 108 స్కెచెస్ వేస్తుండ‌టంతో ఇదే అత్యుత్త‌మ రికార్డు కానుంది. గ‌తంలోనూ సాన్ ఫ్రాన్సిస్కోలో కేటీఆర్‌ను క‌లిసి ఆయ‌న పొట్రెయిట్స్ గిఫ్ట్‌గా కూడా ఇచ్చారు. ఈ నెల 24న కేటీఆర్ బ‌ర్త్‌డే కాబ‌ట్టి వాటిని ఆరోజు ఆయ‌న‌కు బ‌ర్త్‌డే కానుక‌గా ఇవ్వనున్న‌ట్లు అర‌వింద్ తెలిపారు.


Next Story

Most Viewed