భారత్‌లో తగ్గిన కరోనా కేసుల సంఖ్య

35

దిశ,వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత వారం రోజులుగా 14 వేలకు పైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు.. తాజాగా 10 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. తాజాగా గత 24 గంటల్లో 10,584 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. సోమవారం ఒక్కరోజే 78 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,16,434 కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,56,463 మంది మృతి చెందారు. కాగా, దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌గా 1,47,306 కేసులు ఉండగా… కరోనా నుంచి కోలుకుని 1,07,12,665 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటివరకు 1,17,45,552 మంది టీకా తీసుకున్నట్లు వెల్లడించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..