ఏపీలో కొత్తగా 10,175 కరోనా కేసులు

15

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 10,175 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 5,37,687కు చేరింది. వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 97,337 కాగా, వైరస్ నుంచి కోలుకుని 4,35,647 మంది డిశ్చార్జి అయ్యారు. తాజాగా మహమ్మారి కారణంగా 68 మంది మృతిచెందగా, దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,702 కు చేరింది. ఈ మేరకు ఏపీ ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.