నిజామాబాద్ కు 1000 డోసుల రెమెడెసివిర్…

by  |
నిజామాబాద్ కు 1000 డోసుల రెమెడెసివిర్…
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కొవిడ్‌ బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎల్లప్పుడూ సంసిద్దంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శుక్రవారం నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో కోవిడ్-19 పరిస్థితిపై కవిత సమీక్షించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవితో ఫోన్ లో మాట్లాడిన ఆమె… కరోనా పరీక్షలు, చికిత్స, ఆసుపత్రులు వంటి అన్ని అంశాలపై చర్చించారు. శనివారం నిజామాబాద్ జిల్లాకు 1000 డోసుల రెమెడెసివిర్ వాక్సిన్ రానుందని తెలిపారు.మహారాష్ట్రలో కరోనా తీవ్రత దృష్ట్యా, సరిహద్దు ప్రాంతాలు మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కోవిడ్ బెడ్లతో పాటు, నిజామాబాద్ ప్రైవేటు ఆసుపత్రుల్లో 1200 బెడ్లు, కామారెడ్డి ప్రైవేట్ హాస్పటల్స్ లో 400 బెడ్లు, జగిత్యాల జిల్లాలో 400 బెడ్లు కరోనా పేషెంట్ల కోసం సిద్ధంగా ఉన్నాయని అధికారులు ఎమ్మెల్సీ కవితకు వివరించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులో తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని కవిత సూచించారు. ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు త్రాగునీరు, ఆహారం, బెడ్స్‌, దుప్పట్లు, ఇతర సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల‌న్నారు. అంబులెన్స్‌ లు కూడా 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాల‌ని, ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించుకోవాల‌ని సూచించారు.


Next Story

Most Viewed