- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగ్గురు రైతులపై 100 మంది దాడి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పుగోనగూడెం గ్రామంలో అమానుషం జరిగింది. పొలంలో పనులు చేసుకుంటున్న ముగ్గురు రైతులపై సుమారు 100 మంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, రాడ్లతో దాడి చేసి భయాందోళన సృష్టించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు గల్లా గణపతి, గల్లా నాని, గల్లా బాబ్జిపై గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనలో […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తూర్పుగోనగూడెం గ్రామంలో అమానుషం జరిగింది. పొలంలో పనులు చేసుకుంటున్న ముగ్గురు రైతులపై సుమారు 100 మంది గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, రాడ్లతో దాడి చేసి భయాందోళన సృష్టించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు గల్లా గణపతి, గల్లా నాని, గల్లా బాబ్జిపై గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు.
ఈ ఘటనలో ముగ్గురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ముగ్గురు వ్యక్తులను 108 వాహనంలో రాజమహేంద్రవరంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ దాడికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






