- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మృతులకు రూ.10లక్షల పరిహారం : సీఎం విజయన్
<p>దిశ, వెబ్ డెస్క్: కోజికోడ్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం పినరయి విజయన్, గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ నేతృత్వంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం నిర్ణయం తీసుకుంది. సీఎం విజయన్ మీడియాతో మాట్లాడుతూ… ‘‘మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాయపడి చికిత్స పొందుతున్న వారికి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది’’ అని […]</p>

దిశ, వెబ్ డెస్క్: కోజికోడ్ విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం పినరయి విజయన్, గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ నేతృత్వంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం నిర్ణయం తీసుకుంది. సీఎం విజయన్ మీడియాతో మాట్లాడుతూ… ‘‘మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాయపడి చికిత్స పొందుతున్న వారికి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది’’ అని పేర్కొన్నారు.
మృతి చెందిన 18 మందిలో 14 మంది పెద్దవారు కాగా, మరో నలుగురు చిన్నారులు. ‘14 మంది పెద్ద వారిలో ఏడుగురు పురుషులు ఉండగా, మిగతా వారు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం మలప్పురం, కోజికోడ్‌లోని వివిధ ఆస్పత్రుల్లో 149 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 23 మంది పరిస్థితి విషమంగా ఉంది. అంతకు ముందు మరో 23 మంది ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని సీఎం విజయన్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కోజికోడ్ విమానాశ్రయం వద్ద రన్‌వే పై దిగుతూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.






