కారు, బైక్ ఢీ.. ఒకరు మృతి

126

దిశ వాజేడు : ములుగు జిల్లా లో రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం ఏటూరునాగారం మండల పరిధిలోని రొయ్యూరు పెట్రోల్ బంకు సమీపంలో 163 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తోన్న కారు బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్నవ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడిని వాజేడు మండల పరిధిలోని కోయవీరపురం గ్రామానికి చెందిన ఉయిక స్వామి(32)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదంలో మృతి చెందిన స్వామి మృతదేహాన్ని ఏటూరు నాగారం వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..