అభివృద్ధిలో అడుగు ముందే ఉన్నాం.. Minister Harish Rao

by Disha Web Desk 13 |
అభివృద్ధిలో అడుగు ముందే ఉన్నాం.. Minister Harish Rao
X

దిశ, సిద్దిపేట: ప్రజల అండదండలతో సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధిలో.. అడుగు ముందే ఉందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట సమీకృత మార్కెట్ సముదాయ ప్రాంగణంలో మైసమ్మ దేవాలయ నిర్మాణానికి గురువారం మంత్రి హరీష్ రావు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లతో కలికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ రోడ్డులో మరో అధునాతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పట్టణానికి నాలుగు దిక్కులా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

సమీకృత మార్కెట్ సముదాయ ప్రాంగణంలో మైసమ్మ దేవాలయ నిర్మాణం మూడు నెలల్లో పూర్తి చేసుకుని పెద్ద ఎత్తున ప్రారంభించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపాల్ చైర్మన్ రాజనర్సు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు లింగారెడ్డిపల్లి లోని ఆంజనేయ స్వామి దేవాలయం 10వ వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

నిరుపేదలకు అండ.. సీఎం సహాయ నిధి..

వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేయలేని నిరుపేదలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ పరిధిలోని 101 మందికి రూ. 44 లక్షల 95 వేల 500 చెక్కులను మంత్రి హరీష్ రావు లబ్దిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ రకాల వైద్యులు, సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఈ ఏడాదిలో ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాత్ ల్యాబ్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అసుప్రతిలో మోకాళ్ళ మార్పిడి అపరేషన్లు చేపిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, అవసరమైన వారికి అపరేషన్లు చేయించడంతో పాటుగా మందులు, కంటి అద్దాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎంఆర్ ఎఫ్ చెక్కులను వెంటనే బ్యాంక్ ఖాతాలో జమచేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ రోజాశర్మ, మండలాల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed