బాడీ షేమింగ్‌పై జరీనా ఖాన్ సీరియస్..

102

దిశ, సినిమా : ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాకే బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నానని తెలిపింది హీరోయిన్ జరీనా ఖాన్. కాలేజీలో ఉన్నప్పుడు 100కిలోల బరువు మించి ఉన్నా సరే తనెప్పుడూ ఇలాంటి అవమానాలు ఎదుర్కోలేదని చెప్పింది. ఆ విషయం గురించి మాట్లాడేందుకు కూడా భయపడేవారని తెలిపింది. కానీ ఇప్పుడు అందులో సగం బరువు ఉన్నా సరే తనను ఫ్యాట్ స్టార్ అని పిలవడం విచిత్రంగా అనిపిస్తుందని చెప్పింది. తాను నటిని కాబట్టి నటనా సామర్థ్యాలపై కామెంట్ చేయాలి తప్పా బరువు, రంగు, ఎత్తు గురించి కాదని తెలిపింది. బాడీ షేమింగ్ గురించి మాట్లాడకూడదు అని చెప్పే వారే.. తాము సినిమా చేస్తున్నప్పుడు జీరో సైజ్డ్ గర్ల్స్‌ను ఎంచుకుంటారని చెప్పింది. ఇండస్ట్రీలో ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని వివరించింది జరీనా.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..