- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్పుల బాధతో… యువరైతు ఆత్మహత్య
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రామన్నపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన కల్మచర్ల మల్లేశ్(30) అనే రైతు ఐదు ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు. ఇటీవల ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంట మొత్తం దెబ్బతిన్నది. కాగా మల్లేశ్ వ్యవసాయానికి దాదాపు రూ.4 లక్షల వరకూ అప్పు చేసినట్టు సమాచారం. పంట దెబ్బతినడంతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రామన్నపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన కల్మచర్ల మల్లేశ్(30) అనే రైతు ఐదు ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు. ఇటీవల ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు చేతికొచ్చిన పంట మొత్తం దెబ్బతిన్నది. కాగా మల్లేశ్ వ్యవసాయానికి దాదాపు రూ.4 లక్షల వరకూ అప్పు చేసినట్టు సమాచారం. పంట దెబ్బతినడంతో చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక, బుధవారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
Next Story






