‘యుధ్ర’.. మరణం అతనికి కొత్త కాదు!

by  |
‘యుధ్ర’.. మరణం అతనికి కొత్త కాదు!
X

దిశ, సినిమా : మాళవిక మోహనన్, సిద్ధార్థ్ చతుర్వేది న్యూ ఫిల్మ్ ‘యుధ్ర’. ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ నిర్మిస్తున్న సినిమాకు రవి ఉద్యవార్ దర్శకులు. ‘మరణం అతనికి కొత్తేమీ కాదు. అతను యుద్ధంలో ఉన్న వ్యక్తి.. యుధ్ర’ అంటూ టీజర్ షేర్ చేశారు ఫర్హాన్ అక్తర్. ‘తుపాకీ పట్టుకుని సిద్ధాంత్, టార్చ్ పట్టుకుని మాళవిక కనిపించగా.. అదే సమయంలో వారిని టార్గెట్ చేస్తూ బాంబ్ బ్లాస్ట్ కావడం.. సిద్ధాంత్ కాల్పులు ప్రారంభించడం.. అక్కడి నుంచి మాళవికను సేవ్ చేయడంతో ఇద్దరు ప్రేమలో పడటం.. తన దగ్గర మోసపోయిన వ్యక్తిగా మాళవిక ఎక్స్‌ప్రెషన్.. గేమ్ ఓవర్ అంటూ సిద్ధార్థ్ ఫైనల్‌గా చెప్పేయడం’తో టీజర్ ఎండ్ అవుతుంది. మొత్తానికి యాక్షన్, థ్రిల్, రొమాన్స్ కలయికగా వస్తున్న సినిమాపై టీజర్ అంచనాలు పెంచేసింది. సిద్ధాంత్ చతుర్వేది సింగిల్ హీరోగా వస్తున్న ఫస్ట్ ఫిల్మ్ ఇదే కాగా.. ఈ సినిమాతో మాళవికకు బాలీవుడ్‌లో అవకాశాలు పెరిగే చాన్స్ ఉన్నట్లు బీటౌన్ టాక్. కాగా సమ్మర్ 2022లో మూవీ రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Next Story

Most Viewed