ఏకగ్రీవాలతో దుమ్ము రేపిన వైసీపీ

by  |
ఏకగ్రీవాలతో దుమ్ము రేపిన వైసీపీ
X

దిశ, ఏపీ బ్యూరో : మున్సిపల్​ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ నాటికి వైసీపీ ఏకగ్రీవాలతో దుమ్ము రేపింది. ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం మొత్తం 2,794 వార్డులకు పదో తేదీన ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటిల్లో 578 (20.68%) ఏకగ్రీవమైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో 571 (98.8%) అధికార వైసీపీ సొంతం చేసుకుంది. టీడీపీకి 6 (1.03%) మాత్రమే దక్కాయి. బీజేపీ, జనసేనకు ఒకే ఒక్క స్థానంలో ఏకగ్రీవంగా నిల్చింది.

మొత్తం 12 నగర పాలక, 75 పుర పాలక సంఘాల్లో వైసీపీ చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లలో ఏకగ్రీవాలతోనే ఆధిక్యత సాధించింది. 12 మున్సిపాలిటీల్లో సగానికన్నా ఎక్కువ వార్డులను ఏకగ్రీవం చేసుకొని విజయదుందుభి మోగించింది. కడప, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు జిల్లాలోని పల్నాడు ఏరియాలోనే అత్యధికంగా వైసీపీకి ఏకగ్రీవాలు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలో మరో రెండు దక్కాయి. మిగతా అన్ని చోట్లా టీడీపీతోనే ప్రధానంగా తలపడనుంది.


Next Story