- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏడాదిన్నర నుంచి ఎదురు చూపులు!!
<p>దిశ, ఏపీ బ్యూరో: “గతేడాది జూన్ లో మా నాన్న అప్పుచేసి నా పెళ్లి చేశాడు. వైఎస్సార్ పెళ్లి కానుక పథకానికి దరఖాస్తు చేసుకున్నాం. ఇంతవరకు పథకం డబ్బు రాలేదు. నాన్న చనిపోయాడు. అప్పులోళ్లు వత్తిడి చేస్తున్నారు. ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదు సార్!” అంటూ ఓ బిడ్డతల్లి అయిన సంధానీ వాపోయింది. ఒంగోలు నగరంలోని ఆటో మెకానిక్ జిలానీ కూతురు పెళ్లికి చేసిన అప్పులు ఆ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. పెళ్లి కానుక పథకం నగదు కోసం […]</p>

దిశ, ఏపీ బ్యూరో: “గతేడాది జూన్ లో మా నాన్న అప్పుచేసి నా పెళ్లి చేశాడు. వైఎస్సార్ పెళ్లి కానుక పథకానికి దరఖాస్తు చేసుకున్నాం. ఇంతవరకు పథకం డబ్బు రాలేదు. నాన్న చనిపోయాడు. అప్పులోళ్లు వత్తిడి చేస్తున్నారు. ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదు సార్!” అంటూ ఓ బిడ్డతల్లి అయిన సంధానీ వాపోయింది. ఒంగోలు నగరంలోని ఆటో మెకానిక్ జిలానీ కూతురు పెళ్లికి చేసిన అప్పులు ఆ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. పెళ్లి కానుక పథకం నగదు కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో అది చంద్రన్న పెళ్లి కానుక. ప్రభుత్వం మారాక అది వైఎస్సార్ పెళ్లి కానుకయింది. సీఎం వై ఎస్ జగన్ పెళ్లి కానుక నగదును పెంచుతామని ఎన్నికల ముందే హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రోత్సాహక నగదును పెంచారు. గతంలో ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు ఇచ్చేది. దీన్ని లక్ష రూపాయలకు పెంచారు. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు ఇస్తున్న రూ.75 వేలను రూ.1.20 లక్షలు చేశారు. బీసీ యువతులకు ఇస్తున్న రూ.35 వేలను రూ.50 వేలు, కులాంతర వివాహాలు చేసుకునేవారికి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష, దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెంచి ప్రభుత్వం హామీ నిలబెట్టుకుంది.
అలాగే భవన నిర్మాణ కార్మికుల పెళ్లి కానుక సొమ్మును కూడా పెంచింది. రూ.20 వేల నుంచి రూ.లక్ష చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు ఆగ్రవర్ణ పేదలు ఎవరైనా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ, కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే వారింట్లో ఆడపడుచులకు పెళ్లి కానుక వర్తింపజేస్తామని ప్రకటించారు. ప్రోత్సాహక నగదును పెంచారే గానీ ఇంతవరకూ ఒక్క జంటకూ నగదు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత 18 నెలల నుంచి 99 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు పథకం వర్తింపజేయాలి. కానీ వాటి గురించి పట్టించుకున్న నాధుడు లేడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దరఖాస్తుదారులకు వైఎస్సార్ పెళ్లికానుక ప్రోత్సాహక నగదును అందించాలి.






