వైఎస్ వివేకా హత్య కేసు.. ఎర్ర గంగిరెడ్డి అరెస్ట్‌?

by  |
CBI YS Viveka
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణను వేగవంతం చేసింది. 100వ రోజు వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి దగ్గర సీబీఐ సీన్ రీకనస్ట్రక్షన్ చేసింది. హత్య జరిగిన రోజు నలుగురు దుండగులు వివేకా ఇంట్లోకి ఎలా వెళ్లారు అన్నదానిపై సీబీఐ సీన్ రీ కనస్ట్రక్షన్ చేపట్టింది. ఈ అంశానికి సంబంధించి షార్ట్ లెటర్స్‌తో టీషర్ట్‌లు వేయించి సీబీఐ బృందం రిహార్సల్స్ చేసింది.

టిషర్ట్‌లపై సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, రంగన్న పేర్లతో రిహార్సల్స్ చేసింది. అనంతరం సీబీఐ అనుమానితుడు ఎర్రగంగిరెడ్డిని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎర్రగంగిరెడ్డిని వైద్యపరీక్షల కోసం కడప రిమ్స్‌కు సీబీఐ బృందం తరలించింది. దీంతో ఎర్ర గంగిరెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.



Next Story