- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కనీసం ఈ రోజైనా పని చేయండి.. కేసీఆర్‌ను కోరిన వైఎస్ షర్మిల
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికలు వచ్చినప్పుడో.. లేక నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నప్పుడో చేనేతలకు సీఎం కేసీఆర్ ఇచ్చే హామీలన్నీ హాని కలిగించేవే ఉంటాయని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల శనివారం ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అవి నేతన్నలను ఊరిస్తాయి తప్ప.. ఉరి చావుల నుంచి తప్పించడం లేదన్నారు. చేనేతలకు రుణాలు కల్పించే కార్పొరేషన్‌కు ఇప్పటివరకు దిక్కులేదు, బీమా ధీమా లేదన్నారు. మరమగ్గాల ఆధునీకరణ ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా తయారైందని […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికలు వచ్చినప్పుడో.. లేక నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నప్పుడో చేనేతలకు సీఎం కేసీఆర్ ఇచ్చే హామీలన్నీ హాని కలిగించేవే ఉంటాయని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల శనివారం ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అవి నేతన్నలను ఊరిస్తాయి తప్ప.. ఉరి చావుల నుంచి తప్పించడం లేదన్నారు. చేనేతలకు రుణాలు కల్పించే కార్పొరేషన్‌కు ఇప్పటివరకు దిక్కులేదు, బీమా ధీమా లేదన్నారు. మరమగ్గాల ఆధునీకరణ ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా తయారైందని ఆమె విమర్శలు చేశారు. చేనేతల మీద దొరకున్న ప్రేమ ఓట్ల వరకేనని ట్వీట్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగానైనా కేసీఆర్.. నేతన్నలకు ఇచ్చిన హామీలు తెచ్చుకొని వారి బతుకుల్లో వెలుగులు నింపాలని కోరారు.
Next Story






