గ్లోబల్ స్టార్ గంగవ్వ..

by  |
గ్లోబల్ స్టార్ గంగవ్వ..
X

‘కలలు కనండి..సాకారం చేసుకోండి. వయసుతో సంబంధం లేదు.. చదువు రాదన్న దిగులు వద్దు. కేవలం మీ మీద మీరు నమ్మకం ఉంచండి.. లక్ష్యాన్ని సాధించగలరు. విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందనూగలరు’.. ఓ నేషనల్ మీడియా చానల్ మన గంగవ్వను ఉదాహరణగా తీసుకుని రాసిన కథ ఇది.

అవును చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి, పెళ్లయ్యాక భర్త పెట్టే బాధలను భరిస్తూ..ఎన్నో కష్టాలు అనుభవించి లైఫ్‌లో లైఫే లేకుండా పోయిన గంగవ్వ.. 60 ఏళ్ల వయసులో తన నేచురల్ యాక్టింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పాపులర్ యూట్యూబ్ స్టార్‌గా ఎదిగింది. ఇది నా లైఫ్..మీరు స్ఫూర్తిగా తీసుకోండని పదిమందికి చెప్పి ప్రోత్సహించే స్థాయికి ఎదిగింది.

ఒక కూలి చేసుకుని బతికే మహిళా రైతు, బీడీలు చేస్తూ బతుకునీడ్చే మామూలు మారుమూల గ్రామ మహిళ, నేటి యువతరానికి చెప్పేది ఒక్కటే.. మీలో టాలెంట్ ఉందా? టాలెంట్‌తో పాటు పట్టుదల ఉందా? అయితే పోరాడండి. ఎన్నో దారులున్నాయి.. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు ఎన్నో ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయని చెప్తోంది.

నేషనల్ మీడియా చానల్ CNN.. Tech For Good అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. మొబైల్, డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా సమాజంలో సంభవించిన విప్లవాలు, దీని ద్వారా వ్యక్తుల్లో కలిగిన మార్పు, చేరుకున్న లక్ష్యాలను వివరిస్తూ.. ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది. ఈ Tech For Good సిరీస్‌లో గంగవ్వ జీవితంలో జరిగిన మార్పు గురించి ఓ ఎపిసోడ్ డిజైన్ చేసింది CNN. కాగా గంగవ్వ ఇంతకు ముందు కూడా 2019లో నిర్వహించిన Tech For Good కార్యక్రమంలో స్పీచ్ ఇచ్చింది. తన లైఫ్ చేంజ్ చేసింది డైరెక్టర్ శ్రీకాంత్ ఎంకరేజ్‌మెంట్ అని చెప్పింది గంగవ్వ. ఆ ఉపన్యాసం ఆకట్టుకోగా ఇప్పుడు తన లైఫ్ స్టోరీని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేస్తోంది.



Next Story

Most Viewed