- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టుల ఘాతుకం
by Sridhar Babu |
<p>దిశ, భద్రాచలం : ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జగదల్‌పూర్ జిల్లా కేంద్రానికి సుమారు 40 కిమీ దూరంలోని గుమల్వాడ గ్రామంలో రుద్రనాగ్ అనే యువకుడిని మావోయిస్టులు శుక్రవారం హతమార్చారు. నగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టు నేత జోగా మాండవి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హత్య సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు […]</p>

X
దిశ, భద్రాచలం :
ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జగదల్‌పూర్ జిల్లా కేంద్రానికి సుమారు 40 కిమీ దూరంలోని గుమల్వాడ గ్రామంలో రుద్రనాగ్ అనే యువకుడిని మావోయిస్టులు శుక్రవారం హతమార్చారు. నగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టు నేత జోగా మాండవి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హత్య సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలను చేపట్టారు. ఎస్పీ దీపక్ కుమార్ ఈ హత్యను ధృవీకరించారు. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు పార్టీ గంగలూరు ఏరియా కమిటీ ఇన్ ఛార్జీ విజ్జా అలియాస్ భద్రుని తమ సహచర మావోయిస్టులు హత్య చేసిన 48 గంటల వ్యవధిలో జగదల్ పూర్ ఘటన చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు.
Next Story






