యూత్‌కు గాలం వేస్తున్న బోల్డ్ కంటెంట్ యాప్స్

212

దిశ, శేరిలింగంపల్లి: మార్కెట్లో వేల రూపాయల విలువ చేసే మొబైల్స్ ఫోన్స్ ప్రతి రోజు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో ర్యామ్, సాఫ్ట్ వేర్, కెమెరా క్లారిటీ, ఇన్ బిల్ట్ సౌకర్యాలు చూసి వినియోగదారులు మొబైల్స్ కొంటుంటారు. ఒక్కో కంపెనీ, ఒక్కో మోడల్‌లో ఒక్కో వెరైటీ అప్లికేషన్స్‌తో ఫోన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తుంది. ఉన్న ఫీచర్స్‌కు అదనంగా ఇంకొన్ని ఫీచర్స్‌ను యాడ్ చేసుకుంటూ స్మార్ట్ ఫోన్లను ఇంకా స్మార్ట్‌గా మాడిఫై చేసుకుంటున్నారు జనాలు. ఇందుకోసం ప్లేస్టోర్స్ ఉండనే ఉంది. అసలు ఈ ప్లే స్టోర్స్ ఏంటీ, అందులో ఉండే యాప్స్ కోసం యూత్ ఎందుకు అంతలా అట్రాక్ట్ అవుతుంది. అసలు ప్లే స్టోర్ లో ట్రెండింగ్ లో ఉన్న యాప్స్ ఏంటో మీరూ ఓ లుక్కేయండి..

అరచేతిలోనే ప్రపంచం..

ఉదయం నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ చేతికి తగలాలి. లేదా ప్రపంచం తలకిందులై పోయిందన్నంత హడావుడి చేస్తుంటారు యూత్. బాడీలో పార్ట్‌లా ప్రొద్దస్తమానం అరచేతిలో అంటిపెట్టుకునే ఉంటారు. అర్ధరాత్రి వరకు మొబైల్స్ లోనే మొహం పెట్టి ఎప్పుడో గానీ నిద్రలోకి జారుకోరు. ఇంతలా మొబైల్స్ లో ఏముంది. అసలు యూత్ కు ఈ ఫోన్ల పిచ్చేమిటి అనుకుంటూ ఉంటారు ఇంట్లో పెద్దోళ్లు. అరచేతిలో మొబైల్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం మన పాదాల చెంతే ఉంటుంది అంటున్నారు కుర్రకారు. ఇలా అనడానికి కారణాలు లేకపోలేదు. చిన్న పిల్లల రైమ్స్ మొదలు పెద్ద వారి ఆరోగ్యం వరకు, పిల్లల ఆటల నుంచి ఉద్యోగుల ప్రొఫెషన్స్ వరకు, స్కూల్ పిల్లల పాఠాల నుంచి అంతరిక్ష విశేషాల వరకు ప్రతీది ఫోన్ లో కనిపిస్తుంది. ఒక్క సెర్చ్ తో ఏది కావాలంటే అది అరక్షణంలో కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి అంటుంది యూత్.

యాప్స్.. యాప్స్..

ఒక్క ఫోన్ లో ఇన్ని సౌకర్యాలు ఎలా వస్తున్నాయి. అసలందులో ఏమున్నాయి అంటే ప్రథమంగా, ప్రధానంగా చెప్పాల్సినవి యాప్స్. స్మార్ట్ ఫోన్ కొనేప్పుడు అందులో ఇన్ బిల్ట్ గా యూ ట్యూబ్, గూగుల్ క్రోమ్, జీ మెయిల్, గూగుల్ మ్యాప్స్ ఎలాగూ ఉంటాయి. వాటితోపాటు ఈమధ్య కాలంలో చాలా మొబైల్ కంపెనీలు సోషల్ యాప్స్, న్యూస్ యాప్స్, గేమింగ్స్ ఇన్ బిల్ట్ గా ఇన్స్టాల్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇవేగాక ఎవరికి తోచిన విధంగా యాప్స్ అప్ డేట్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆండ్రాయిడ్ యాప్స్, విండోస్ యాప్స్, ఐఫోన్స్ యాప్స్, బ్లాక్ బెర్రీ యాప్స్ అంటూ ఆయా కంపెనీలు యూత్ తో పాటు అన్ని వర్గాల కస్టమర్లను ఆకట్టుకునేలా యాప్స్ ను రూపొందిస్తున్నారు. వీటిలో కొన్ని యాప్స్ టాప్ ట్రెండింగిల్ లో ఉన్నాయి. అందులో ఫేస్ బుక్, యూ ట్యూబ్, మెసెంజర్, క్రోమ్, పింట్ రెస్ట్, ఇలా 50 యాప్స్ ప్లే స్టోర్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. వీటితోపాటు సోషల్ మీడియా యాప్స్, గేమింగ్ యాప్స్, ఎడ్యుకేషన్ యాప్స్ కూడా యూత్ ను బాగా ఆకర్షిస్తున్నాయి.

యాప్స్ హోరు..

కుర్రకారు కోసం ఇంకొన్ని యాప్స్ కూడా ఈ ప్లే స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ బోల్డ్ కంటెంట్ యాప్స్. ఇందులోనూ చాలా వెరైటీ యాప్స్ యూత్ ను అట్రాక్ట్ చేసేలా ఉంటున్నాయి. కొన్ని యాప్స్ అయితే కంప్లీట్ గా బోల్డ్ కంటెంట్ ను కలిగి ఉంటున్నాయి. ఇందులో చాలావరకు చైనా తయారీ యాప్స్ ఉండడంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం వీటిలో కొన్నింటిని రిమూవ్ చేసింది. అందులో బిగో యాప్ ఒకటి. ఈ బిగో యాప్ లో చాలా వరకు అడల్ట్ కంటెంట్ ఉండేది. అయినా ఇప్పటికీ బిగో లైట్ యాప్ యూజర్లకు అందుబాటులోనే ఉంది. అలాగే కొన్ని గేమింగ్ యాప్స్ ను కూడా రిమూవ్ చేశారు. ఇప్పుడు కూడా ప్లే స్టోర్ లో ఉన్న కొన్ని అడల్ట్ కంటెంట్ యాప్స్ చూస్తూ మస్తీ చేస్తోంది యూత్. అందులో ఫేస్ చాట్, లైవ్ టాక్, ట్యాంగో, చామేట్, యూ ప్రో, పారా యూ, మూమూ ఇలా చాలా యాప్స్ అడల్ట్ కంటెంట్ కలిగి ఉంటున్నాయి. ఈ యాప్స్ ఇన్ స్టాల్ కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ వీటిని వాడాలంటే మాత్రం ప్యాకేజీలు ఉన్నాయి. ఇందులో ఒక్కో ప్యాకేజీ వందల రూపాయల నుంచి మొదలు వేల వరకు ఉంటుంది. అలా ప్యాకేజీ తీసుకుని ఎదుటి వారితో లైవ్ చాట్, వీడియో కాల్స్ మాట్లాడే ఛాన్స్ కల్పిస్తున్నారు ఈ యాప్స్ డెవలపర్స్. వీటి మాయలో పడి కొంతమంది యూత్ మొబైల్స్ ను వదలడం లేదు. ఇంకొందరు ఈతరహా యాప్స్ కోసం డబ్బు తగలేస్తూ మనీ, టైమ్ రెండూ వేస్ట్ చేసుకుంటున్నారు. అందుకే అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. మొబైల్ మీచేతిలో ఉంది కదా.. అని అతిగా వాడుతూ ఏది పడితే అది ఇన్ స్టాల్ చేసి అందులోకి తొంగి చూసేయకుండా మనకు అవసరమైన యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకుని హాయిగా వాడుకోడం బెటర్. లేదా మాల్ వేర్ తో మీ మొబైల్స్ పాడవడమే కాక, మీరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..