- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరిఖనిలో యువకుడి దారుణ హత్య
by Sridhar Babu |
<p>దిశ, వెబ్ డెస్క్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణంలోని గాంధీనగర్ సింగరేణి క్వార్టర్ డి-781 లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో మహంకాళి మధుకర్(25) దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో గద్దల వంశీ అనే యువకుడు ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పదునైన ఆయుధంతో మృతుని తలపై కొట్టి అతి దారుణంగా చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన గోదావరిఖని వన్ టౌన్ సిఐ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణంలోని గాంధీనగర్ సింగరేణి క్వార్టర్ డి-781 లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో మహంకాళి మధుకర్(25) దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో గద్దల వంశీ అనే యువకుడు ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
పదునైన ఆయుధంతో మృతుని తలపై కొట్టి అతి దారుణంగా చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన గోదావరిఖని వన్ టౌన్ సిఐ రమేష్ కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు. గద్దల వంశీపై గతంలో పలు కేసులు నమోదైనట్టు స్థానిక సమాచారం.
Next Story






