పెట్రోల్ బంక్‌లో యువతి ఎఫైర్.. హెర్నియా వచ్చిన బాలుడితో కలిసి..!

by  |
Young Woman Love Affair
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ ఎప్పుడు, ఎవరి మీద, ఎలా చిగురిస్తుందో చెప్పలేం. కానీ ఆ ప్రేమను దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తాం. గొడవలు, మోసాలు, పోలీస్ స్టేషన్లు ఇలా ఎన్నో ఫీట్లు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. మైనర్ బాలుడిని ప్రేమించిన యువతి.. అతడిని తీసుకోని వెళ్లి వివాహం చేసుకుంది. బాలుడి తల్లి ఫిర్యాదుతో వారి సంసారం తెగిపోయింది. ఇంతకూ ఏం జరిగిందంటే..

కోయంబత్తూరులోని పొలచ్చికి చెందిన యువతి (19) స్థానికంగా ఓ పెట్రోల్ బంక్‌లో పని చేస్తుంది. అయితే సమీపంలోనే నివాసం ఉంటున్న ఓ బాలుడు (17) రోజు కాలేజీకి వెళ్తూ అదే బంక్‌లో పెట్రోల్ పోయించుకునేవాడు. అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది స్నేహంతోనే ఆగిపోకుండా ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. బాలుడితో కలిసి ఆ యువతి చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు యువతిని హెచ్చరించారు. అతడికి ఇంకా మైనారిటీ తీరలేదని, ప్రేమకు ఇది సమయం కాదని నచ్చజెప్పారు. ఇదే సమయంలో బాలుడికి హెర్నియా ఆపరేషన్ జరిగింది.

అయితే అప్పటికే బాలుడికి దూరమై ఇబ్బంది పడుతున్న యువతి.. అతడికి ఆపరేషన్ అయిందని తెలుసుకుని ఆస్పత్రికి వెళ్లింది. అనంతరం అక్కడి వారి కళ్లుగప్పి బాలుడితో జంప్ అయింది. ఇద్దరు కలిసి డిండిగల్ జిల్లాకు పారిపోయి దొంగచాటుగా పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కోయంబత్తూరులోని సెమ్మెడుకు వచ్చి కాపురం పెట్టారు. అయితే మైనర్ అయిన తన కుమారుడిని ఓ యువతి తీసుకెళ్లి పెళ్లి చేసుకుందని బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న యువతి నేరుగా ఆ బాలుడిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం స్పెషల్ కోర్టులో హాజరు పరిచి, కోయంబత్తూర్ సెంట్రల్ జైలులో రిమాండ్ చేశారు. ఈ కేసు ప్రస్తుతం తమిళనాడులో సంచలనంగా మారింది.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story