- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యంగ్ టైగర్ ఆవిష్కరించిన ‘తిమ్మరుసు’ ట్రైలర్
<p>దిశ, సినిమా : డిఫరెంట్ క్యారెక్టర్ సెలెక్షన్‌తో ప్రతీ సినిమాకు వైవిధ్యం చూపిస్తున్న కథానాయకుడు సత్యదేవ్. ఎలాంటి పాత్రలోనైనా పర్ఫెక్ట్‌గా ఒదిగిపోయే కొద్దిమంది నటుల్లో తను కూడా ఒకడు. ‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి చిత్రాల్లో నటనతో ఆకట్టుకున్న సత్యదేవ్.. ఇప్పుడు అన్యాయాలను ప్రశ్నించే లాయర్ ‘తిమ్మరుసు’గా రాబోతున్నాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ జూలై 30న విడుదల కానుండగా, ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చిత్ర యూనిట్‌ను అభినందించారు. ట్రైలర్ […]</p>

దిశ, సినిమా : డిఫరెంట్ క్యారెక్టర్ సెలెక్షన్‌తో ప్రతీ సినిమాకు వైవిధ్యం చూపిస్తున్న కథానాయకుడు సత్యదేవ్. ఎలాంటి పాత్రలోనైనా పర్ఫెక్ట్‌గా ఒదిగిపోయే కొద్దిమంది నటుల్లో తను కూడా ఒకడు. ‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి చిత్రాల్లో నటనతో ఆకట్టుకున్న సత్యదేవ్.. ఇప్పుడు అన్యాయాలను ప్రశ్నించే లాయర్ ‘తిమ్మరుసు’గా రాబోతున్నాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ జూలై 30న విడుదల కానుండగా, ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చిత్ర యూనిట్‌ను అభినందించారు. ట్రైలర్ చూస్తే ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ క్యాబ్ డ్రైవర్ మర్డర్ కాంపెన్సేషన్ కేస్ చుట్టూ కథ తిరుగుతుందనే విషయం అర్థమవుతోంది. ఈ కేసును రీఓపెన్ చేసి, నిజాలు తేల్చేందుకు పోరాడే లాయర్ పాత్రలో సత్యదేవ్ ఇంటెన్సివ్ యాక్టింగ్‌తో పాటు తన ప్రయత్నాలకు అడ్డుతగిలే పోలీస్ ఆఫీసర్‌గా అజయ్ పర్ఫార్మెన్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి.
‘నీ ముందున్నది వాలి అని మరిచిపోకు, ఎదురుగా ఉంటే సగం బలం లాగుతా.. లాయర్ రామచంద్రా!’ అని బెదిరిస్తున్న అజయ్‌కు.. ‘నువ్వు సగం బలం లాక్కునే వాలివయితే, నేను దండేసి దండించే రామున్ని’ అంటూ అంతే పవర్‌ఫుల్‌గా సత్యదేవ్ పేల్చిన డైలాగ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్ర టీజర్, ప్రమోషనల్ సాంగ్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకోవడం విశేషం. మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించిన చిత్రానికి చరణ్ పాకాల మ్యూజిక్ అందించారు.
- Tags
- NTR






