హ్యాపీ బర్త్‌ డే యంగ్ రెబల్ స్టార్

by  |
హ్యాపీ బర్త్‌ డే యంగ్ రెబల్ స్టార్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమ సత్తాను సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రపంచ నలమూలకు చాటి చెప్పిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా ఈశ్వర్ చిత్రంతో హీరోగా పరిచయం అయి.. అనతికాలంలోనే తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. కేవలం నటనతోనే కాకుండా మంచి మానవతా దృక్పథం కలిగిన వ్యక్తి ప్రభాస్.. కరోనా మహమ్మారి కట్టడితో పాటు హైదరాబాద్ వరద బాధితులకూ తన వంతుగా భారీ సాయం చేశారు.

సినిమాల్లో కూడా వర్షం, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిర్చి, బాహుబలి, సాహో వంటి అద్భుత విభిన్నమైన చిత్రాలు చేసి, అందిరి మన్ననలు పొందుతున్నారు. బాహుబలి సినిమాకు ముందు తెలుగు ఇండస్ట్రీలో వరకే ఉన్న ప్రభాస్ ఇమేజ్‌ను దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌలి ఏకంగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు చైనా, అమెరికా వంటి దేశాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ చేసే సినిమాలన్నీ తెలుగు, హిందీ, తమిళం, మళయాలం భాషల్లో విడుదల అవుతున్నాయి. కాగా ఓ పక్క యూత్, మరో పక్క ఫ్యామిలీ అభిమానులను అలరింపజేస్తూ.. తన ఇమేజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నాడు. అంతేగాంకుండా అందరినీ అప్యాయంగా పలకరిస్తూ.. ప్రభాస్ ఫ్రెండ్లీగా ఉంటారు. దీంతో అభిమానులే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో అనేకమంది హీరోలు, దర్శకులు ప్రభాస్‌ను ఇష్టపడతారు. అలాంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. ఈ సందర్భంగా ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు.


Next Story