- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బార్‌లో ఫుల్లుగా తాగేసి.. బిల్లు అడిగినందుకు ఏం చేశారంటే.?
by Shyam |
<p>దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని ఎస్.ఆర్ బార్‌లో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు బార్ మేనేజర్‌పై దాడి చేసి తీవ్రంగా చితకబాదారు. అడ్డుకోబోయిన బార్ సిబ్బందిపై కూడా దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలోని ఎస్.ఆర్ బార్‌కు రాత్రి ఐదుగురు యువకులు మద్యం సేవించేందుకు వచ్చారు. మద్యం సేవించిన అనంతరం వారిలో వారు గొడవ పెట్టుకొని ఘర్షణకు దిగారు. ఘర్షణ ఆపేందుకు […]</p>

X
దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని ఎస్.ఆర్ బార్‌లో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు బార్ మేనేజర్‌పై దాడి చేసి తీవ్రంగా చితకబాదారు. అడ్డుకోబోయిన బార్ సిబ్బందిపై కూడా దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలోని ఎస్.ఆర్ బార్‌కు రాత్రి ఐదుగురు యువకులు మద్యం సేవించేందుకు వచ్చారు.
మద్యం సేవించిన అనంతరం వారిలో వారు గొడవ పెట్టుకొని ఘర్షణకు దిగారు. ఘర్షణ ఆపేందుకు బార్ సిబ్బంది వెళ్లగా వారిపై దాడి చేశారు. అనంతరం మద్యం బిల్లు కట్టాలని అడగడంతో మరోసారి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బార్ మేనేజర్ రాజేశ్వర్ రావు తలకు తీవ్ర గాయమైంది. ఈ క్రమంలో మేనేజర్ రాజేశ్వర్ రావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






