ఆ ఒక్క ఆశతో వెళితే.. మైనర్‌లకు నరకం చూపించిన మేస్త్రీ.. నిత్యం అదే పని..!

by Vadlamudi Anukaran |

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. చాక్లెట్లను ఆశగా చూపి మైనర్ బాలికలకు నరకం చూపించాడు ఓ కామాంధుడు. ఈ ఘటన తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ నగరంలోని 6వ టౌన్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఇద్దరు మైనర్ (8, 11) బాలికలపై మేస్త్రీ పనిచేసే యువకుడు వసీం కన్నేశాడు. ఐదు రోజుల క్రితం సదరు మైనర్‌లకు చాక్లెట్ ఆశ చూపిన యువకుడు వారిపై అత్యాచారం [&hellip;]</p>

ఆ ఒక్క ఆశతో వెళితే.. మైనర్‌లకు నరకం చూపించిన మేస్త్రీ.. నిత్యం అదే పని..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. చాక్లెట్లను ఆశగా చూపి మైనర్ బాలికలకు నరకం చూపించాడు ఓ కామాంధుడు. ఈ ఘటన తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్‌ నగరంలోని 6వ టౌన్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఇద్దరు మైనర్ (8, 11) బాలికలపై మేస్త్రీ పనిచేసే యువకుడు వసీం కన్నేశాడు. ఐదు రోజుల క్రితం సదరు మైనర్‌లకు చాక్లెట్ ఆశ చూపిన యువకుడు వారిపై అత్యాచారం చేశాడు. ఇలా చాక్లెట్ ఆశ చూపిస్తూ చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు తెలుసుకున్న తల్లిదండ్రులు నిందితుడికి బుధవారం రాత్రి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు పట్టించారు.

విచారణలో షాకింగ్ నిజాలు..

బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా.. ఇంటి పక్కన ఉన్న మైనర్‌లకు చాక్లెట్ ఆశ చూపించి బలవంతంగా అత్యాచారం చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో నిజామాబాద్ 6వ టౌన్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధిత మైనర్‌లను చికిత్స నిమిత్తం గురువారం ఉదయం ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై స్పందించిన ఏసీపీ వెంకటేశ్వర్లు తన ఆధ్వర్యంలోనే విచారణ జరుగుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. నిందితుడు వసీంను రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు.

Next Story