ధర్మపురిలో దారుణం.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం

240

దిశ, జగిత్యాల/ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్‎పై అత్యాచారం జరిగిందని జిల్లా ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. గురువారం రాత్రి మీడియాకు ఘటన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదేళ్ల బాలికపై ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల యువకుడు బుధవారం అత్యాచారానికి పాల్పడ్డాడని వివరించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం నెంబర్ 371.2021లో ఐపీసీ 448, 376 (ఎ), (బి), సెక్షన్ 6 పోక్సో యాక్ట్ 2012 ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. ఫిర్యాదు అందిన వెంటనే ధర్మపురి సీఐ కోటేశ్వర్ ఆధ్వర్యంలో స్పెషల్ టీంను రంగంలోకి దింపామని, నిందితుడిని నేరెళ్ళ సమీపంలోని సాంబశివుని గుట్ట వద్ద అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాలిక వాంగ్మూలాన్ని మహిళా ఎస్సై నవత నమోదు చేశారని, వీడియో రికార్డింగ్ కూడా చేశామని ఎస్పీ సింధూశర్మ తెలిపారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రత్నాపురం ప్రకాష్, ధర్మపురి సీఐ కోటేశ్వర్‌లు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..