- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. గడ్డిమోపు ఎత్తుకొస్తూ యువకుడు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, నారాయణఖేడ్: పిడుగు పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నారాయణఖేడ్ మండల పరిధిలోని సత్యగామ గ్రామానికి చెందిన గొల్ల మహేష్ (24) అనే యువకుడు మంగళవారం సాయంత్రం తన తల్లి అంజమ్మతో కలిసి గ్రామశివారులోని పత్తిచేనుకు వెళ్లి గడ్డిమోపుతో తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కొంచెం దూరంగా ఉన్న తల్లి అంజమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, పోస్ట్ మార్టం […]</p>

X
దిశ, నారాయణఖేడ్: పిడుగు పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నారాయణఖేడ్ మండల పరిధిలోని సత్యగామ గ్రామానికి చెందిన గొల్ల మహేష్ (24) అనే యువకుడు మంగళవారం సాయంత్రం తన తల్లి అంజమ్మతో కలిసి గ్రామశివారులోని పత్తిచేనుకు వెళ్లి గడ్డిమోపుతో తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కొంచెం దూరంగా ఉన్న తల్లి అంజమ్మకు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా, పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహేశ్ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
- Tags
- lightning strike
Next Story






