- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో విషాదం.. చెప్పులు పైకి తీస్తుండగా యువకుడు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, ఎల్బీనగర్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ షాక్ కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని భాగ్యలత రోడ్డు శాంతి నగర్ లో రాహుల్ (19) అనే యువకుడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. గురువారం తన నివాసంలోని రెండవ అంతస్తులో ఉండే రాహుల్ క్రింది అంతస్తు రేకుల షెడ్డు పై […]</p>

X
దిశ, ఎల్బీనగర్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ షాక్ కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని భాగ్యలత రోడ్డు శాంతి నగర్ లో రాహుల్ (19) అనే యువకుడు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. గురువారం తన నివాసంలోని రెండవ అంతస్తులో ఉండే రాహుల్ క్రింది అంతస్తు రేకుల షెడ్డు పై చెప్పులు పడిపోవడంతో వాటిని ఐరన్ రాడ్ తో పైకి తీసే ప్రయత్నం చేశాడు. భవనం పక్క నుండి వెళ్లిన 11 కె.వి. విద్యుత్ తీగలకు రాడ్ తగలడంతో షాక్ గురై అక్కడికక్కడే మృతిచెందాడు. రాహుల్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Next Story






