- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, చేవెళ్ల : మోటార్ బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలవర్తి గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన రంగయ్య గారి పాండురంగం(28) మోటార్ బైక్‌పై శంకర్‌పల్లి వస్తుండగా ఎలవర్తి గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్ మీద నుంచి ఎగిరిపడటంతో […]</p>

X
దిశ, చేవెళ్ల : మోటార్ బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలవర్తి గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన రంగయ్య గారి పాండురంగం(28) మోటార్ బైక్‌పై శంకర్‌పల్లి వస్తుండగా ఎలవర్తి గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ క్రమంలో బైక్ మీద నుంచి ఎగిరిపడటంతో తలకు బలంగా దెబ్బతగిలింది. దీంతో పాండురంగం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Tags
- dead
Next Story






