- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లి మందలింపు.. కొడుకు ఆత్మహత్య
<p>దిశ, వెబ్‌డెస్క్: మాట వినడంలేదని కొడుకును తల్లి మందలించింది. అంత మాత్రానికే ఆ తల్లికి కొడుకు కడుపు కోత మిగిల్చాడు. అమ్మ తిట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్లా జిల్లా తంగెళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన సాయికుమార్.. తన తల్లి మందలించడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. దీంతో ఈ నెల 26న ఇంట్లో నుంచి వెళ్లి ఎంతకీ తిరిగి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మాట వినడంలేదని కొడుకును తల్లి మందలించింది. అంత మాత్రానికే ఆ తల్లికి కొడుకు కడుపు కోత మిగిల్చాడు. అమ్మ తిట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సిరిసిల్లా జిల్లా తంగెళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన సాయికుమార్.. తన తల్లి మందలించడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. దీంతో ఈ నెల 26న ఇంట్లో నుంచి వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు సాయి కుమార్ కోసం వెతుకులాట ప్రారంభించారు. అయితే, ఈ రోజు ఉదయం సాయికుమార్ తంగెళ్లపల్లి సమీపంలోని ఓ వ్యవసాయ భూమిలో విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






