లారీలోంచి దూకి నిందితుడు ఆత్మహత్య

by  |
లారీలోంచి దూకి నిందితుడు ఆత్మహత్య
X

దిశ, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం వద్ద కదులుతున్న లారీ నుంచి దూకి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లా జోరుగామల్లి మండలం ఎడ్లూరుపాడుకు చెందిన వెంకట్రావు కొన్ని నెలల క్రితం 12 సంవత్సరాల మైనర్ బాలికతో హైదరాబాద్ పారిపోయిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని ప్రకాశం జిల్లాకు తిరిగి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో వాహనం దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.


Next Story

Most Viewed