- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాము.. పాము.. అంటూ పక్కింట్లో మైనర్ బాలికపై..
<p>దిశ, ఆందోల్: ప్రస్తుత కాలంలో మైనర్ బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకున్న ప్రబుద్ధులు కామకోరికలు తీర్చుకునేందుకు దిగజారుతున్నారు. తాజాగా పాము పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండల పరిధి ఖాదిరాబాద్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనపై స్థానిక ఎస్సై దశరథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖాదిరాబాద్‌కు చెందిన నాగిదిగారి మల్లేష్ (20) అదే గ్రామంలో ఉంటున్న మైనర్‌పై కన్నేశాడు. ఎలాగైనా సరే […]</p>

దిశ, ఆందోల్: ప్రస్తుత కాలంలో మైనర్ బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకున్న ప్రబుద్ధులు కామకోరికలు తీర్చుకునేందుకు దిగజారుతున్నారు. తాజాగా పాము పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండల పరిధి ఖాదిరాబాద్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
ఈ ఘటనపై స్థానిక ఎస్సై దశరథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖాదిరాబాద్‌కు చెందిన నాగిదిగారి మల్లేష్ (20) అదే గ్రామంలో ఉంటున్న మైనర్‌పై కన్నేశాడు. ఎలాగైనా సరే అత్యాచారం చేయాలని పథకం వేసుకున్నాడు. ఇదే క్రమంలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మైనర్ ఇంట్లో ఒంటిరిగా ఉండడాన్ని గమనించాడు. ఎలాగైనా సరే ఇంట్లోకి వెళ్లాలని పాము సాకు చెప్పాడు. ఇంట్లోకి పాము వచ్చింది అంటూ మైనర్‌ను బయపెట్టి.. దగ్గరకు వెళ్లి అత్యాచార యత్నం చేశాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. సాయంత్రం తల్లిదండ్రులు వచ్చాక జరిగిన విషయాన్ని బాధితురాలు చెప్పడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు.
- Tags
- minor girl






