పాతబస్తీలో మరో చిన్నారిపై కామాంధుడి కన్ను.. కట్టేసి కొట్టిన స్థానికులు

by Vadlamudi Anukaran |

<p>దిశ, చార్మినార్: సింగరేణికాలనీలో మైనర్ బాలిక వ్యవహారం సంచలనం రేపుతున్న వేళ పాతబస్తీలో మరో కామాంధుడి నిర్వాకం బయటకొచ్చింది. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజీవ్​గాంధీ నగర్‌కు చెందిన 10 ఏళ్ల మైనర్ బాలిక ఆగస్టు 31వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటుంది. ఆ బాలికపై ఎప్పటి నుంచో కన్నేసిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెతో మాట్లాడుతున్నట్టు నటిస్తూనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే [&hellip;]</p>

పాతబస్తీలో మరో చిన్నారిపై కామాంధుడి కన్ను.. కట్టేసి కొట్టిన స్థానికులు
X

దిశ, చార్మినార్: సింగరేణికాలనీలో మైనర్ బాలిక వ్యవహారం సంచలనం రేపుతున్న వేళ పాతబస్తీలో మరో కామాంధుడి నిర్వాకం బయటకొచ్చింది. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజీవ్​గాంధీ నగర్‌కు చెందిన 10 ఏళ్ల మైనర్ బాలిక ఆగస్టు 31వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటుంది. ఆ బాలికపై ఎప్పటి నుంచో కన్నేసిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెతో మాట్లాడుతున్నట్టు నటిస్తూనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిన బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది.

మళ్లీ ఎపుడైనా.. ఎక్కడైనా అతడు కనిపిస్తే తమకు చెప్పాలని తల్లిదండ్రులు బాలికను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఇంటి ముందు సైకిల్​ తొక్కుతున్న బాలిక దగ్గరగా వచ్చాడు ఆ యువకుడు. దీంతో భయంతో మైనర్​బాలిక కేకలు పెట్టింది. ఆ బాలిక కేకలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఏమయింది అని అడగ్గానే అసభ్యకరంగా ప్రవర్తించింది ఇతనే అని చెప్పడం.. అప్పటికే సైదాబాద్‌లో జరిగిన చైత్ర ఘటనతో రగిలిపోయిన స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు.

అనంతరం బాలిక తండ్రి ఛత్రినాక పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు రక్షాపురంకు చెందిన ముజీబుర్​రహమాన్​(21) (ఎలక్ట్రిషియన్)గా పోలీసులు గుర్తించారు. 31వ తేదీన తాగిన మైకంలో చేశానని ముజీబుర్​రహమాన్​ పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించాడు. దీంతో రహమాన్​పై ఫొక్సో చట్టం కింద ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story