యువ న్యాయవాది గోపి మృతి.. సంతాపం తెలిపిన బార్ అసోసియేషన్

by Batti.Sumithra |

<p>దిశ, కొత్తగూడెం : కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ కుమారుడు హైకోర్టు యువ న్యాయవాది లక్కినేని గోపినాధ్ ఆకాల మరణం చెందాడు. ఆయన మృతి పట్ల.. కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సంతాపసభలో న్యాయవాదులు.. గోపి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా గోపి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా [&hellip;]</p>

యువ న్యాయవాది గోపి మృతి.. సంతాపం తెలిపిన బార్ అసోసియేషన్
X

దిశ, కొత్తగూడెం : కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ కుమారుడు హైకోర్టు యువ న్యాయవాది లక్కినేని గోపినాధ్ ఆకాల మరణం చెందాడు. ఆయన మృతి పట్ల.. కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సంతాపసభలో న్యాయవాదులు.. గోపి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు.

ఈ సందర్భంగా గోపి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో వక్తలు ప్రసంగిస్తూ.. లక్కినేని గోపీనాథ్ తన న్యాయవాద వృత్తిని కొత్తగూడెం బార్ అసోసియేషన్ నుండే ప్రారంభించి అనతికాలంలోనే రాష్ట్ర హైకోర్టులో మంచి న్యాయవాదిగా పేరు సంపాదించుకున్నాడని, అసోసియేషన్ సభ్యులతో చాలా సఖ్యతగా మేలిగేవాడని తెలిపారు. గోపీనాథ్ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్న సమయంలో ఇలా మృత్యువాత పడటం చాలా విషాదకరమన్నారు. గోపి కుటుంబానికి బార్ అసోసియేషన్ అండగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story