- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి ఆగిందని యువతి ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: పెళ్లి ఆగిపోయిందనే బాధతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. శాంతినగర్‌లో ఉంటున్న చేనేత కార్మికురాలైన పబ్బతి హేమవతి(25)కి ఈ నెల 26న వివాహం జరగాల్సి ఉంది. ఆమె తండ్రి ఇటీవలే మృతి చెందడంతో కుటుంబ భారం తల్లి నారాయణమ్మపై పడింది. ఈ క్రమంలో బిడ్డ పెళ్లి కోసమని నారాయణమ్మ తెలిసినవారి దగ్గర అప్పు అడగ్గా, లాక్‌డౌన్ కారణంగా ఎవరూ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. డబ్బులు సర్దుబాటు […]</p>
అమరావతి: పెళ్లి ఆగిపోయిందనే బాధతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. శాంతినగర్‌లో ఉంటున్న చేనేత కార్మికురాలైన పబ్బతి హేమవతి(25)కి ఈ నెల 26న వివాహం జరగాల్సి ఉంది. ఆమె తండ్రి ఇటీవలే మృతి చెందడంతో కుటుంబ భారం తల్లి నారాయణమ్మపై పడింది. ఈ క్రమంలో బిడ్డ పెళ్లి కోసమని నారాయణమ్మ తెలిసినవారి దగ్గర అప్పు అడగ్గా, లాక్‌డౌన్ కారణంగా ఎవరూ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో పెళ్లి ఆగిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన హేమవతి.. మగ్గం షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
Tags: young girle, sucide, crime news, ananthapur, ap
Next Story






