- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డోర్నకల్‌లో యువరైతు ఆత్మహత్య
by Batti.Sumithra |
<p>దిశ, డోర్నకల్ : యువ రైతు సూసైడ్ చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చింతకాయల వీరబాబు(23) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది తనకున్న మూడు ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి సాగు చేశాడు. దీని సాగు కోసం, గతేడాది తన చెల్లి పెండ్లి కోసం అప్పు చేశాడు. అప్పు […]</p>

X
దిశ, డోర్నకల్ : యువ రైతు సూసైడ్ చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చింతకాయల వీరబాబు(23) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది తనకున్న మూడు ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి సాగు చేశాడు. దీని సాగు కోసం, గతేడాది తన చెల్లి పెండ్లి కోసం అప్పు చేశాడు. అప్పు ఎలా తీర్చాలో తెలియక మానసిక ఆవేదనకు గురై చేనులో పురుగుల మందు తాగాడు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వచ్చి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Next Story






