అమెరికా టు ఇండియా జీపేలో మనీ ట్రాన్స్‌ఫర్

by  |
అమెరికా టు ఇండియా జీపేలో మనీ ట్రాన్స్‌ఫర్
X

దిశ, ఫీచర్స్ : 33 కోట్ల అమెరికా జనాభాలో 4.47 కోట్ల ప్రజలు విదేశీయులే కాగా అందులో 27 లక్షల మంది భారతీయులే. అయితే అమెరికా నుంచి తమ దేశాల్లోని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఇతరులకు డబ్బు పంపించాలంటే కాస్త కష్టమైన పనే. మనదేశంలో ఏ మూలన ఉన్న వ్యక్తికైనా ‘గూగుల్ పే’ ఉంటే చాలు ఈజీగా, క్షణాల్లోనే మనీ సెండ్ చేసేయొచ్చు. ఇప్పుడు అమెరికాలో ఉన్నా అంతే ఈజీగా డబ్బులు పంపేయొచ్చు. ఈ ఆప్షన్‌ను ఇటీవలే గూగుల్ పే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

ఇండియా, సింగపూర్‌లో అందుబాటులో ఉన్న గూగుల్ పే వెర్షన్‌‌ను యునైటెడ్ స్టేట్స్‌లోని వినియోగదారులకు గత ఏడాది నవంబర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్. తాజాగా ఆ యాప్ ద్వారా ఇరు దేశాల్లోని తమ యూజర్లకు యూఎస్ నుంచి మనీ ట్రాన్సఫర్ చేసే అవకాశం కల్పించింది. యుఎస్ వినియోగదారులకు జూన్ 16 వరకు వెస్ట్రన్ యూనియన్ నుంచి ఫ్రీ మనీ ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయని గూగుల్ చెబుతుంది. అయితే వైజ్ 500 డాలర్ల లోపు సెండ్ చేస్తే ఒకే ఫ్రీ ట్రాన్స్‌ఫర్ అందిస్తుంది.

ప్రాసెస్ :
* మొదగా ఇరుదేశాల్లోని వ్యక్తులకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే లేటెస్ట్ వెర్షన్ ‘గూగుల్ పే’ డౌన్‌లోడే/అప్‌డేట్ చేయాలి.
* గూగుల్ ఆదేశాలనుకనుగుణంగా బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి.
* గూగుల్ పే యాప్ హోమ్ స్క్రీన్‌లోని ‘పే’ బటన్‌ను ట్యాప్ చేసి వెస్ట్రన్ లేదా వైజ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
* పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయడానికి సూచనలను అనుసరించండి.
ఇండియాలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశ ప్రభుత్వాలు మనదేశానికి సహాయం చేయడానికి ముందుకు రావడంతో పాటు, వైద్య సామాగ్రిని అందిస్తున్నాయి. యుఎస్ నివాసితులు, ఎన్ఆర్ఐలు దేశానికి నిధులను సేకరించి బదిలీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి డబ్బులు పంపడం, స్వీకరించడం కోసం
ఈ ఫీచర్ వినియోగదారులకు ఉపయోగపడుతుందని గూగుల్ భావిస్తుంది.
‘ వెస్ట్రన్ యూనియన్’ వైజ్‌ భాగస్వామ్యంతో ఇది సాధ్యమైంది. ప్రస్తుతానికి యుఎస్ నుంచి భారతదేశం, సింగపూర్‌లకు మాత్రమే బదిలీలు సాధ్యం. కానీ ఈ ఏడాది చివరినాటికి యు.ఎస్. గూగుల్ పే యూజర్లు వెస్ట్రన్ యూనియన్ ద్వారా 200 కంటే ఎక్కువ దేశాలకు వైజ్ ద్వారా డబ్బు పంపగలరని మేము ఆశిస్తున్నాం.
– గూగుల్ బ్లాగ్‌పోస్ట్


Next Story

Most Viewed