స్టార్ సింగర్ ఇల్లీగల్ అఫైర్స్.. లీక్ చేసిందని భార్యను లిక్కర్ బాటిల్‌‌తో

217

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ సింగర్ యోయో హానీ సింగ్ పై  ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస కేసు పెట్టింది. అంతేకాకుండా తనను లైంగికంగా వేధిస్తున్నాడని, ఆర్థిక మోసం, మానసిక హింసకు గురిచేస్తున్నట్లు  తెలుపుతూ ఢిల్లీలోని తిస్‌ హజారీ కోర్టులో ‘గృహ హింస నుంచి మహిళల రక్షణ’ చట్టం కింద మంగళవారం పిటిషన్‌ దాఖలు చేసింది. దాదాపు పదేళ్ల డేటింగ్ తర్వాత తన చైల్డ్ హుడ్ స్వీట్ హార్ట్ శాలినిని జనవరి 23, 2011లో పెళ్లి చేసుకున్న హనీ సింగ్.. మ్యారేజ్‌కు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో ఎందుకు లీక్ చేశావంటూ తీవ్రంగా కొట్టాడని వాపోయింది.

తన వైవాహిక జీవితం గురించి దాచిపెట్టేందుకు ఇలా చేశాడని, తన కెరియర్ డల్ అయ్యాక.. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్‌గా ఎక్కువ టార్చర్ పెడుతున్నాడని, చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తున్నాడని తెలిపింది. హనీ సింగ్ హిట్ సాంగ్ ‘బ్రౌన్ రంగ్ దే’ సమయంలో ఫిమేల్ కొలిగ్స్‌తో ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ పెట్టుకున్నాడని తెలిపిన శాలిని.. దీని గురించి ప్రశ్నిస్తే లిక్కర్ బాటిల్‌‌తో కొట్టాడని పేర్కొంది. ఈ క్రమంలోనే కోర్టు సింగర్ హనీసింగ్ కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై హానీ సింగ్ ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాల్సిందిగా ఆదేశించింది. హనీ సింగ్‌, అతడి భార్య పేరు మీద ఉన్న ఉమ్మడి ఆస్తుల జోలికి వెళ్లడానికి వీలు లేకుండా.. షాలిని తల్వార్‌కు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక దీపికా పదుకోనే , సైఫ్‌ అలీఖాన్‌ జంటగా నటించిన ‘కాక్‌టెయిల్‌’ చిత్రంలోని ఆంగ్రేజీ బీట్‌ పాటతో హనీ సింగ్‌ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..