Breaking news : దేశంలో ఎల్లో ఫంగస్ కలకలం.. మొదటి కేసు నమోదు

by Vadlamudi Anukaran |   (  Updated:2021-05-24 02:54:12  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఎల్లో ఫంగస్ కలకలం రేపుతోంది. ఒక పక్క కరోనా సెకండ్ వేవ్ తన విశ్వరూపాన్ని చూపిస్తుంటే.. మరో పక్క ఫంగస్ ఇన్ఫెక్షన్లు ప్రజలను వణికిస్తున్నాయి. ఇప్పటీకే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు దేశంలో నమోదు కావడం, ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ వలన పలువురు మృతిచెందడం సంచలనంగా మారుతున్న తరుణంలో మరో ఫంగస్ ఎటాక్ కావడం ప్రజలను  భయాందోళనలకు గురిచేస్తుంది. తాజాగా యూపీలోని ఘజియాబాద్ లో ఎల్లో ఫంగస్ కేసు నమోదు [&hellip;]</p>

Breaking news : దేశంలో ఎల్లో ఫంగస్ కలకలం.. మొదటి కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఎల్లో ఫంగస్ కలకలం రేపుతోంది. ఒక పక్క కరోనా సెకండ్ వేవ్ తన విశ్వరూపాన్ని చూపిస్తుంటే.. మరో పక్క ఫంగస్ ఇన్ఫెక్షన్లు ప్రజలను వణికిస్తున్నాయి. ఇప్పటీకే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు దేశంలో నమోదు కావడం, ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ వలన పలువురు మృతిచెందడం సంచలనంగా మారుతున్న తరుణంలో మరో ఫంగస్ ఎటాక్ కావడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. తాజాగా యూపీలోని ఘజియాబాద్ లో ఎల్లో ఫంగస్ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఎల్లో ఫంగస్ వచ్చిన వ్యక్తికి ఈఎన్‌టీ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కంటే ఎల్లో ఫంగస్ చాలా ప్రమాదకరమని వైద్యులు తెలుపుతున్నారు.

Next Story