బాలయ్యకు షాక్.. హిందూపురం వైసీపీదే

by  |
బాలయ్యకు షాక్.. హిందూపురం వైసీపీదే
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు సొంత ఇలాఖాలో షాక్ తగిలింది. ఇవాళ వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హిందూపురం మున్సిపాలిటీపై వైసీసీ జెండా ఎగురువేసింది. వారం రోజుల పాటు బాలయ్య వీధి వీధికి తిరిగి ప్రచారం నిర్వహించినా లాభం లేకపోయింది. బాలయ్య ప్రచారం నిర్వహించినా.. ఓటర్లు మాత్రం వైసీపీ వైపే మళ్లారు.

హిందూపురం అంటే టీడీపీకి కంచుకోట అని ఎవరినీ అడిగినా చెబుతారు. తెలుగువారి ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత హరికృష్ణ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచారు. ఏ ఎన్నికల్లోనైనా ఇక్కడ టీడీపీకి ఎదురులేదని చెబుతారు.

అలాంటిది ఇప్పుడు హిందూపురం మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది.

Next Story

Most Viewed