అధైర్య పడొద్దు… అండగా ఉంటాం…

85
దిశ, ఏపీ బ్యూరో: ఏ ఒక్క రైతుకీ అన్యాయం జరగనివ్వం. ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంపారు. మీ బాధలు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిస్తామంటూ మంత్రులు మేకతోటి సుచరిత, రంగనాధరాజు రైతులకు భరోసానిచ్చారు.
శనివారం గుంటూరు జిల్లా  వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లోని చిర్రావూరు, బొమ్మవానిపాలెం, చిలుమూరు, జువ్వలపాలెం, వెల్లటూరు గ్రామాల్లో పర్యటించారు. వరద తాకిడికి గురైన ఆ గ్రామాల్లో ప్రజలను పరామర్శించారు. రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. పేదలకు నిత్యావసరాలు అందిస్తామని చెప్పారు. మంత్రులతోపాటు వ్యవసాయ మిషన్చైర్మన్ఎంవీఎస్నాగిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు.