డబ్ల్యూటీఏ టూర్ క్యాలెండర్ విడుదల

by  |
డబ్ల్యూటీఏ టూర్ క్యాలెండర్ విడుదల
X

దిశ, స్పోర్ట్స్ : మహిళ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) 2021కి సంబంధించిన టూర్ క్యాలెండర్‌ను శనివారం విడుదల చేసింది. వచ్చే ఏడాది తొలి ఏడు వారాలకు సంబంధించిన టోర్నీలను ఈ క్యాలెండర్‌లో పొందుపరిచారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఆక్లాండ్, షెంజెన్‌లలో నిర్వహించాల్సిన డబ్ల్యూటీఏ 250 టోర్నీలను 2021 క్యాలెండర్ నుంచి తొలగించారు. ఈ సీజన్ జనవరి 5 నుంచి అబుదాబిలో జరిగే డబ్ల్యూటీఏ టెన్నిస్ ఓపెన్ ద్వారా ప్రారంభం కానుంది.

జనవరి 10 నుంచి దుబాయ్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలియర్స్, ఫిబ్రవరి 1 నుంచి మెల్‌బోర్న్ డబ్ల్యూటీఏ 500 టోర్నీ, ఫిబ్రవరి 8 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుందని క్యాలెండర్‌లో పేర్కొన్నారు. ఏటీపీ తమ షెడ్యూల్ ప్రకటించిన రెండు రోజుల తర్వాత డబ్ల్యూటీఏ తమ క్యాలెండర్ ప్రకటించింది. దుబాయ్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయర్స్ ముగిసిన తర్వాత అర్హులైన టెన్నిస్ ప్లేయర్ల కోసం టెన్నిస్ ఆస్ట్రేలియా చార్టెడ్ ఫ్లయిట్స్ ఏర్పాటు చేసింది. దుబాయ్, సింగపూర్, లాస్ ఏంజెల్స్ నుంచి ఈ విమానాలు ఆటగాళ్లను ఆస్ట్రేలియా చేరుస్తాయని డబ్ల్యూటీఏ ప్రకటించింది.



Next Story