- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేపాల్ యువత అలా ఉంటే భారత యువత ఇలా.. ప్రపంచ యాత్రికుడి కామెంట్స్ వైరల్
నేపాల్ యువత అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపితే భారత యువత ఫ్యాన్ వార్స్ పెట్టుకుంటున్నారని ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: నేపాల్ యువత అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపితే భారత యువత ఫ్యాన్ వార్స్ పెట్టుకుంటున్నారని ట్రావెల్ యూట్యూబర్ అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన పేరుమీదనే వందకు పైగా ఇన్ స్టాగ్రామ్ పేజీలు క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్నారని అన్నారు. కొందరైతే తాను చేసిన కామెంట్స్ స్క్రీన్ షాట్స్ తీసి వైరల్ చేస్తున్నారని చెప్పారు. మన యువత అంత ఖాళీగా ఉన్నారు అంటూ ఎద్దేవా చూశారు. తాతల కాలం నాటి సినిమాలు రీరిలీజ్ అయినా థియేటర్ లో పేపర్లు జల్లుకుని కొట్టుకుచస్తున్నారని మండిపడ్డారు.
సోషల్ మీడియాలో కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఫైట్ చేసుకుంటున్నారని అన్నారు. అయితే సినిమాలు లేదంటే కులం, పార్టీలు అంటూ కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. దేశమంతా ఇలానే ఉందన్నారు. ముందు మనదేశంలో సోషల్ మీడియా బ్యాన్ చేయాలన్నారు. సోషల్ మీడియాపై ఆంక్షలు పెట్టాలని కొంత వయసు వచ్చే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా చేయాలన్నారు. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్లు ప్రీమియం చెల్లించి వాట్సాప్ వినియోగించుకునేలా ప్రభుత్వం చేయాలన్నారు. ఇండియాలో సోషల్ మీడియా వాడకం విచ్చల విడిగా పెరిగిపోయిందని స్కూళ్లు, కాలేజీల్లోకి కూడా ఫోన్లను అనుమతించవద్దన్నారు.






