Lay Offs: నిద్ర లేస్తూనే లేఆఫ్‌ మెయిల్స్‌.. ఉద్యోగులకు షాకిచ్చిన మెటా

by Naga Rani Yarlagadda |

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా మరోసారి భారీ లేఆఫ్స్ తో ఎంప్లాయిస్ కు షాకిచ్చింది.

Lay Offs: నిద్ర లేస్తూనే లేఆఫ్‌ మెయిల్స్‌.. ఉద్యోగులకు షాకిచ్చిన మెటా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా మరోసారి భారీ లేఆఫ్స్ తో ఎంప్లాయిస్ కు షాకిచ్చింది. ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి.. ఆ తర్వాత టైమ్ జోన్ల ప్రకారం నిద్రలేచే సమయానికల్లా లేఆఫ్స్ మెయిల్స్ పంపడం చర్చనీయాంశమైంది. అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లో మెటా ఈ విధానాన్ని ఎంచుకుంది. మొదట ఆఫీసులకు రాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పి.. ఆ తర్వాత లే ఆఫ్స్ ఇవ్వడంతో ఉద్యోగులు షాకయ్యారు. సింగపూర్ హబ్ లోని ఉద్యోగులకు స్థానిక సమయం తెల్లవారుజామున 4 గంటలకు.. (భారత్ లో రాత్రి 1.30 గంటలకు) ఉద్యోగాలు ఊడినట్లు ఉద్యోగులకు మెయిల్స్ అందాయి. తన మొత్తం సిబ్బందిలో 10 శాతం మంది.. అంటే 8 వేల మంది ఉద్యోగులపై మెటా వేటు వేసింది.

ఈ లే ఆఫ్స్ కు ముందు మెటాలో మొత్తం 78,000 మంది ఉద్యోగులు ఉండేవారు. తాజాగా 8 వేల మంది ఉద్యోగుల్ని తొలగించడమే కాకుండా సంస్థాగతంగా మార్పులు కూడా చేస్తున్నట్లు సమాచారం. మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ పంపిన అంతర్గత మెమో ప్రకారం.. సుమారు 7,000 మంది ఉద్యోగులను కొత్త ఏఐ-నేటివ్ (AI-native) బృందాల్లోకి బదిలీ చేయనున్నారు. అలాగే దాదాపు 6,000 ఖాళీ పోస్టులను రద్దు చేస్తూ, మేనేజర్ల స్థాయిలను తగ్గించారు. కంపెనీని మరింత వేగంగా, తక్కువ మందితో సమర్థవంతంగా నడిపించడమే దీని లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కోతల్లో ఇంజనీరింగ్, ప్రొడక్ట్ విభాగాలు ఎక్కువగా నష్టపోనున్నాయి. ప్రస్తుతం మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఏఐ సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఈ ఏడాది ఏఐ కోసం ఏకంగా 125 నుండి 145 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని మెటా ప్రణాళికలు సిద్ధం చేసింది.

Next Story