300 ఏళ్ల తర్వాత ఖైదీకి క్షమాపణ చెప్పిన కోర్టు.. మాదే తప్పు..

by Dishafeatures2 |
300 ఏళ్ల తర్వాత ఖైదీకి క్షమాపణ చెప్పిన కోర్టు.. మాదే తప్పు..
X

దిశ, వెబ్‌డెస్క్: మనిషి అన్న తర్వాత తప్పు చేయడం సహజం. వారు ఏ పదవిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా తప్పులు జరుగుతుంటాయి. కాకపోతే వాటిని ఎంత త్వరగా సరిదిద్దుకున్నామన్నది ముఖ్యం. కానీ కోర్టు విషయంలో మాత్రం ఆ ఆస్కారం కూడా ఉండదు. కోర్టు అన్నాక అసలు తప్పు చేయకూడదనే అందరూ భావిస్తారు. ఎందుకంటే కోర్టు ఒక నిర్ణయం ఒకరి జీవితంతో సమానంగా ఉంటుంది. కానీ అనేక సందర్భాల్లో కోర్టు తప్పిదాల కారణంగా ఎందరో అమాయకులు శిక్ష అనుభవించారు. వారికి కోర్టు క్షమాపణ చెప్తూ విడుదల చేస్తుంది. అయితే తాజాగా యూఎస్‌లో ఓ రాష్ట్ర చట్టసభ సభ్యులు ఓ మహిళకు క్షమాపణ చెప్పారు.

ఆమెను తప్పుగా దోషిగా పరిగణించి శిక్షించామని వారు బేషరతుగా క్షమాపణ చెప్పారు. అయితే ఆమెకు శిక్ష పడి ఇప్పటికి 329 సంవత్సరాలు. 1693లో ఎలిజబెత్ జాన్సన్ జూనియర్ అనే మహిళ మంత్రవిద్యను ఉపయోగిస్తున్న కేసులో దోషిగా నిర్ధారించబడింది. ఆమెపై మసాచుసెట్స్‌లోని సేలం మంత్రగత్తెగా ముద్రవేసింది. ఆమెకు ఈ కేసులో మరణశిక్షను విధించారు. ఇదే కేసులో మంత్రగత్తెగా ఆరోపించబడిన వారికి ముందుగా క్షమాపణ లభించింది. కానీ ఎలిజబెత్‌ మాత్రం అధికారికంగా క్షమించబడలేదు. ఆ కారణంగా సేలం చట్ట సభ సభ్యులు తాజాగా ఆమెకు క్షమాపణలు చెప్పారు.

Next Story

Most Viewed