బీచ్‌లో యువతిపై గ్యాంగ్ రేప్.. శరీరమంతా కొరుకుతూ రెండు గంటలపాటు టార్చర్..

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-27 09:45:55  IST  )

సౌత్ ఐరోపాలోని క్రొయేషియాలో దారుణం చోటు చేసుకుంది. స్ప్లిట్‌లో ఓ బీచ్ హోటల్‌లో ముగ్గురు బ్రిటిష్ వ్యక్తులు అమీ అరిఫీ (29), గెజిమ్ షాఫా (28), సోహ్కిబ్ షాకిబీ (24).. 28ఏళ్ల యువతి మటేజుష్కాపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బీచ్‌లో యువతిపై గ్యాంగ్ రేప్.. శరీరమంతా కొరుకుతూ రెండు గంటలపాటు టార్చర్..
X

దిశ, వెబ్ డెస్క్ : సౌత్ ఐరోపాలోని క్రొయేషియాలో దారుణం చోటు చేసుకుంది. స్ప్లిట్‌లో ఓ బీచ్ హోటల్‌లో ముగ్గురు బ్రిటిష్ వ్యక్తులు అమీ అరిఫీ (29), గెజిమ్ షాఫా (28), సోహ్కిబ్ షాకిబీ (24).. 28ఏళ్ల యువతి మటేజుష్కాపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జూలై 22న ఈ ఘటనలో రెండు గంటల పాటు బాధితురాలి శరీరమంతా కొరుకుతూ టార్చర్ చేశారని నివేదికలు చెప్తున్నాయి. లండన్‌కు చెందిన ఈ ముగ్గురు బాధితురాలిని బలవంతంగా ఉదయం 5:30 గంటల సమయంలో బీచ్‌లోని హోటల్ గదికి తీసుకెళ్లారు. కొరకడం, అనుచితంగా స్పర్శించడం, లైంగికంగా టార్చర్ చేయగా.. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడిగా అనుమానించారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ నెల 24న జడ్జి ముందు హాజరుపరిచారు. మరింత దర్యాప్తు కోసం నెల రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నారు. దోషులుగా తేలితే.. పదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు.

Next Story