ఎయిర్‌పోర్ట్‌లో భారత విద్యార్థిపై అమానుషం..స్పందించిన అమెరికా

by Ajay Maddhiboyina |

న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో భారతీయ విద్యార్థిపై అక్కడి పోలీసులు దారుణంగా వ్యవహరించిన వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఎయిర్‌పోర్ట్‌లో భారత విద్యార్థిపై అమానుషం..స్పందించిన అమెరికా
X

దిశ‌, వెబ్ డెస్క్: న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో భారతీయ విద్యార్థిపై అక్కడి పోలీసులు దారుణంగా వ్యవహరించిన వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. విద్యార్థిని నేలపై పడుకోబెట్టి, అతడి చేతికి సంకెళ్లు వేశారు. ఓ క్రిమిన‌ల్ మాధిరిగా అత‌డి చుట్టూ పోలీసులు చేరి బంధించారు. దీనికి సంబంధించిన వీడియోను అమెరికాలో నివసిస్తున్న కునాల్ జైన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇండియ‌న్ ఎంబ‌సీ, భార‌త దౌత్య‌వేత్త‌ జైశంక‌ర్ కు ట్యాగ్ చేసి ఈ విద్యార్థి త‌న‌తో పాటే ఫ్లైట్ దిగాడ‌ని కానీ ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ పోలీసులు అత‌డిపై దారుణంగా వ్య‌వ‌హ‌రించార‌ని పేర్కొన్నాడు.

మ‌న దేశానికి చెందిన వ్య‌క్తితో పోలీసులు అలా వ్య‌వహ‌రిస్తున్నా ఏమీ చేయలేక‌పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. కాగా అమెరికా ఎంబ‌సీ దీనిపై స్పందించింది. యునైటెడ్ స్టేట్స్ చ‌ట్ట‌బ‌ద్ధంగా వ‌చ్చే ప్ర‌యాణికుల‌ను స్వాగ‌తిస్తూనే ఉంటుంద‌ని తెలిపింది. కానీ అక్ర‌మంగా రావ‌డం, వీసాలను దుర్వినియోగం చేయడం, అమెరికా చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డాన్ని మాత్రం స‌హించం అని స్ప‌ష్టం చేసింది.

Next Story