గ్రహణ సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ ఎందుకు ఏర్పడుతుంది? ఈసారి మనకూ కనిపిస్తుందా?

by Naga Rani Yarlagadda |

ఫిబ్రవరి 17న సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణ సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ ఏర్పడనుంది. ఇది భారత్ లో కనిపిస్తుందా?

గ్రహణ సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ ఎందుకు ఏర్పడుతుంది? ఈసారి మనకూ కనిపిస్తుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం ఖగోళ ప్రియులను అలరించనుంది. ఎందుకంటే గ్రహణ సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ ఏర్పడనుంది.

రింగ్ ఆఫ్ ఫైర్ అంటే..

ఒక్కోసారి సూర్యగ్రహణ సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంది. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డొచ్చినపుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడి పరిమాణం చిన్నగా ఉంటే.. సూర్యుడిని పూర్తిగా కప్పలేడు. 96 శాతం మాత్రమే చంద్రుడు కప్పగలడు. సూర్యుడి చుట్టూ అంచులు మాత్రం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపిస్తాయి. దీన్ని కంకణాకార గ్రహణం లేదా రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలుస్తారు. 17న 2 నిమిషాల 20 సెకన్ల సమయంపాటు రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. యూటీసీ (Coordinated Universal Time) ప్రకారం ఆ రోజు ఉదయం 7.01గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది.

మనకూ కనిపిస్తుందా?

ఈ సూర్యగ్రహణాన్ని, రింగ్ ఆఫ్ ఫైర్ భారత్ లో కనిపించదు. ఈ గ్రహణం ఏర్పడే సమయంలో సూర్యుడు దిగంతం కింద ఉంటాడు కాబట్టి పాక్షికంగా కూడా గ్రహణం కనిపించదు. కానీ.. NASA వంటి అంతరిక్ష సంస్థలు టెలీకాస్ట్ చేసే ఆన్ లైన్ లైవ్ స్ట్రీమ్స్ ద్వారా ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చు. అంటార్కిటికాలో మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సౌతాఫ్రికా, టాంజానియా, జింబాబ్వే వంటి ఆఫ్రికా దేశాలతో పాటు అర్జెంటీనా, చిలీ వంటి దేశాల్లో పాక్షికంగా సూర్యగ్రహణం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Next Story