మళ్లీ విజృంభిస్తున్న మ‌హ‌మ్మారి, రిస్క్‌లో 560 కోట్ల మంది.. WHO స్ట్రాంగ్ వార్నింగ్

by Ajay Maddhiboyina |

ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చికెన్ గున్యా విజృంభించే ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్ ఇచ్చింది. 2005లో అనేక దేశాల్లో చికెెన్ గున్యా కేసులు అధికంగా నమోదై చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

మళ్లీ విజృంభిస్తున్న మ‌హ‌మ్మారి, రిస్క్‌లో 560 కోట్ల మంది.. WHO స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చికెన్ గున్యా విజృంభించే ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్ ఇచ్చింది. 2005లో అనేక దేశాల్లో చికెెన్ గున్యా కేసులు అధికంగా నమోదై చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు అరమిలియన్ మంది ప్రజలు దీని బారినపడి ఇబ్బంది పడ్డారని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. అయితే తరవాత అంతరించిపోయిన వైరస్ ఇప్పుడు మళ్లీ వస్తోందని డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్ ఇచ్చింది. ఆసియా, యూరప్ అంతటా వేగంగా కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 560 కోట్ల మంది ప్రమాదంలో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి డయానా రోజాస్ పేర్కొన్నారు. వర్షాకాలంలో దోమల ద్వారా చికెన్ గున్యా వ్యాపిస్తుందని చెప్పారు. అధిక జ్వరం, తీవ్రమైన కీళ్లనొప్పులతో పాటు కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక వైకల్యానికి కూడా కారణమవుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి వ్యాక్సిన్ అందుబాటులో లేదని తెలిపారు.

2005లో లా రీయూనియన్, మయొట్టే, మారిషస్ లాంటి లాంటి చిన్న దీవుల్లో ప్రారంభమైన వైరస్ తరవాత వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరించిందన్నారు. వైరస్ వ్యాప్తికి ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వాతావరణ మార్పులే కారణమని తెలిపారు. మే 1 నుండి ఫ్రాన్స్‌లో సుమారు 800 కేసులను గుర్తించా, ఇటలీలోనూ కొందరు చికెన్ గున్యా బారినపడ్డారని తెలిపారు. ఇది ప్రధానంగా ఎడిస్ దోమల వల్ల వ్యాప్తి చెందుతుందని, పగటిపూట ఈ దోమలు చురుకుగా ఉంటాయని చెప్పారు. కాబట్టి వర్షా కాలంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రమాదం ఎక్కువ అని తెలిపారు. ప్రస్తుతం చికెన్ గున్యాకు చికిత్స, టీకాలు అందుబాలో లేనందున నివారణ ఉత్తమం అని సూచించారు.

Next Story