వైద్యం అందక భారత సంతతి వ్యక్తి మృతి.. కెనడా ఆరోగ్య వ్యవస్థపై మస్క్ విమర్శలు

by Naga Rani Yarlagadda |

ఇటీవల కాలంలో కెనడాలో భారత సంతతి వ్యక్తి ప్రశాంత్ శ్రీకుమార్ ప్రాణాలు కోల్పోగా..

వైద్యం అందక భారత సంతతి వ్యక్తి మృతి.. కెనడా ఆరోగ్య వ్యవస్థపై మస్క్ విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో కెనడాలో భారత సంతతి వ్యక్తి ప్రశాంత్ శ్రీకుమార్ ప్రాణాలు కోల్పోగా.. అందుకు అక్కడి వైద్యుల నిర్లక్ష్యమే కారణం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలపై ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ స్పందించారు. కెనడా ఆరోగ్య వ్యవస్థను అమెరికా మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ తో పోల్చారు. వైద్యం అవసరమైన వ్యక్తికి సరైన సమయంలో వైద్యం అందించలేకపోవడంపై విమర్శలు గుప్పించారు.

భారత్ కు చెందిన ప్రశాంత్ శ్రీకుమార్ (44) కెనడాలో స్థిరపడ్డారు. ఆయనకు ఇటీవల ఛాతీలో నొప్పి రావడంతో ఎడ్మంటన్ లోని గ్రే నన్స్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంటనే డాక్టర్లు ఆయన్ను పరిశీలించి ఈసీజీ తీసి.. అతనికి గుండెపోటు రాలేదని తెలిపారు. కానీ.. ఆ తర్వాత వెయిటింగ్ ఏరియాలోనే ప్రశాంత్ తీవ్రమైన ఛాతి నొప్పితో మరణించాడు. ఆస్పత్రి సిబ్బంది తన భర్త పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో తెలుపుతూ అతని భార్య సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్.. ఈ ఘటన అక్కడి వైద్యుల అసమర్థతకు నిదర్శనంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.

Next Story